ETV Bharat / city

భాగ్యనగరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విజయసంకల్ప శిబిరం - HYDERABAD RSS LATEST

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ విజయసంకల్ప శిబిరం భాగ్యనగరంలో ఘనంగా ప్రారంభమైంది. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వందేళ్లవుతున్న సందర్భంగా తెలంగాణలోని 10,000 గ్రామాలకు చేరువ కావాలనే వ్యూహంతో ఆర్‌ఎస్‌ఎస్‌ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టింది. సంఘ్‌ విస్తరణ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ‘గతి విధులను’ విస్తృతంగా నిర్వహించే విషయంపై చర్చించారు.

RSS Succession Camp in Bhagyanagar
భాగ్యనగరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విజయసంకల్ప శిబిరం
author img

By

Published : Dec 25, 2019, 5:09 AM IST

Updated : Dec 25, 2019, 7:00 AM IST

తెలుపు, ఖాకీ రంగు దుస్తులు.. చేతిలో లాఠీలతో కార్యకర్తల సందడి మధ్య రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) విజయసంకల్ప శిబిరం ఘనంగా ప్రారంభమైంది. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వందేళ్లవుతున్న సందర్భంగా తెలంగాణలోని 10,000 గ్రామాలకు చేరువ కావాలనే వ్యూహంతో ఆర్‌ఎస్‌ఎస్‌ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టింది.

సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చ

రాష్ట్రం నలుమూలల నుంచి స్వయంసేవకులతో పాటు భాజపా, ఏబీవీపీ, కిసాన్‌ సంఘ్‌ నేతలు హాజరయ్యారు. ఈ శిబిరానికి నగర శివారు మంగళ్‌పల్లిలోని భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వేదికైంది. సంఘ్‌ విస్తరణ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ‘గతి విధులను’ విస్తృతంగా నిర్వహించే విషయంపై చర్చించారు.

8,000 మంది స్వయంసేవకులు
జిల్లాల నుంచి 8,000 మంది స్వయంసేవకులు హాజరయ్యారు. వివిధ క్షేత్రాల రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విచ్చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శులు భాగయ్య, ముకుందాజీ, జాతీయ స్థాయి అధికారులు, క్షేత్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దూసరి రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు దక్షిణామూర్తి, రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్‌ తదితరులు కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు. శిబిరానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ హాజరయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌లు పాల్గొన్నారు.

చారిత్రక కట్టడాలు హిందూ వారసత్వం

సంస్కృతిని హిందూ సంస్కృతిగా, ధర్మాన్ని హిందూ ధర్మంగా, చారిత్రక కట్టడాలను హిందూ వారసత్వ సంపదగా భావించే ప్రతి ఒక్కరూ హిందువేనని ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలె శ్యామ్‌కుమార్‌ అన్నారు. ఈ భావనకు వ్యతిరేకంగా ఉన్న వారు ఇక్కడి వారు కాదని పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు ఐక్యంగా పనిచేయాలన్నారు.

సరూర్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభ

సరూర్‌నగర్‌ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంఘ్‌ కార్యకర్తలు, భాజపా, ఏబీవీపీ, కిసాన్‌ సంఘ్‌ కార్యకర్తలు, నేతలు హాజరు కానున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.

ఇవీ చూడండి: వినియోగదారుడా... హక్కులు తెలుసుకో

Intro:Body:Conclusion:
Last Updated : Dec 25, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.