ETV Bharat / city

'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరి మారకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. 'ఆర్టీసీని రక్షించాలి, ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలి, కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి' అని డిమాండ్​ చేస్తూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించాయి.

round table meeting at hyderabad on rtc issue
'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'
author img

By

Published : Nov 27, 2019, 3:52 PM IST

'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'
ఆర్టీసీ కార్మికుల హక్కుల పట్ల ప్రభుత్వం గౌరవం లేకుండా వ్యవహరిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌ ఏఐటీయూసీ ప్రధాన కార్యాలయంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించాయి.

ఈ సమావేశానికి తెజస అధ్యక్షుడు కోదండరాం, తె తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి వెంటనే అఖిపక్ష సమావేశం నిర్వహించి, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమే సీఎం కేసీఆర్​కు లేఖలు రాసినట్లు తెలిపారు. రోడ్డు రవాణా సంస్థను కనుమరుగు చెయ్యాలన్న కేసీఆర్‌ ఆలోచన బయటపడిందని తె తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను అరెస్టులు చేయడాన్ని తప్పుబట్టారు. మహిళా కండక్టర్ల చేత కన్నీళ్లు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

ఇవీచూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.