ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాదేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇంగ్లీష్ జట్టుపై నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 97 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ 3, ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగాయి. గాయమైన శార్దూల్ ఠాకుర్ స్థానంలో ఇషాంత్ శర్మను తుదిజట్టులోకి తీసుకుంది కోహ్లీ సేన. ఇంగ్లాండ్‌కు బ్రాడ్, క్రాలీ, లారెన్స్ దూరం కాగా వారి స్థానాల్లో మార్క్ వుడ్, హసీబ్ హమీద్, మొయిన్ అలీ వచ్చారు.