రైతుల ఉద్యమం, వారి త్యాగాలు, దేశవ్యాప్తంగా వారి పోరాటానికి వచ్చిన మద్దతు చూసి సాగు చట్టాలు రద్దు(farm laws withdrawn 2021) చేయడం ప్రధాని మోదీ(prime minister modi) తీసుకున్న సరైన నిర్ణయమని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి(R. narayanamurthy) అన్నారు. కర్షకుల ఆవేదన అర్థం చేసుకుని పశ్చాత్తాపంతో చట్టాలు రద్దు చేసిన ప్రధానిని లార్డ్ మింటోతో పోల్చారు. వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ చట్టాల(electricity acts 2020)ను కూడా కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే రైతులకు కష్టాలు తప్పవని.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్(telangana cm kcr).. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని.. ఇప్పుడు ఆ చట్టాలు అమలు చేస్తే వాళ్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నారాయణమూర్తి అన్నారు.
అలాగే.. సాగు చట్టాల రద్దు(farm laws withdrawn 2021) కోసం పోరాడి.. ఆ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలని కేంద్రమే ఆదుకోవాలని కోరారు. వారి కుటుంబాలకు పరిహారం అందజేసి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల కోసం ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం.. మద్దతు ధరలపై కూడా దృష్టి సారించాలని నారాయణమూర్తి(R. narayanamurthy) కోరారు. పంటల కొనుగోలు(paddy procurement 2021)పై కర్షకులకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
"రెండేళ్లుగా కరోనా మహమ్మారి(corona pandemic news 2021)తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే.. ఆ మహమ్మారికి తొణకకుండా.. బెణకకుండా.. ధైర్యంగా ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి అన్నం పెట్టిన వ్యక్తి అన్నదాత. అలాంటి రైతును కష్టపెట్టడం సబబు కాదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. సాగు చట్టాలు రద్దు చేశారు. అదే విధంగా విద్యుత్ చట్టాలు కూడా రద్దు చేస్తే.. భారతదేశ రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసి ప్రపంచం పొట్ట నింపుతాడు. ప్రపంచ దేశాల ఎదుట తలెత్తుకు తిరుగుతాడు."
- ఆర్. నారాయణమూర్తి, సినీ నటుడు
ఇవీ చదవండి :