లాక్డౌన్ అమలవుతున్న సమయంలోనూ హైదరాబాద్ ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. బయటికి రావొద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా.. కొంతమంది వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాహనాల సంఖ్య పెరగడం వల్ల కొన్ని కూడళ్ల వద్ద సిగ్నళ్లు కూడా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు. నిన్న ఒక్కరోజే నగరంలో సుమారు 15వేల వాహనాలకు జరిమానా విధించారు. అందులో 13వేల మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు..
ఇవీచూడండి: 'రోడ్లపైకి వస్తున్నవారు ఏవో కారణాలు చెబుతున్నారు'