పెండింగ్లో ఉన్న వ్యవసాయ భూమలు వివాదాల పరిష్కారం సమయంలో రెవెన్యూ ప్రత్యేక ట్రైబ్యునళ్లు హైకోర్టు ఆదేశాలను పూర్తి స్థాయిలో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆయా పక్షాలకు నోటీసులు జారీ చేసిన అనంతరం విచారణకు అవకాశం ఇచ్చాకే ట్రైబ్యునళ్లు తీర్పు వెలువరించాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రతిని కూడా వారికి పంపారు.
ఇదే సమయంలో ట్రైబ్యునళ్లకు బదలాయించిన అన్ని కేసులు, వాటికి సంబంధించిన అన్ని వివరాలను సోమవారంలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సీఎస్ ఆదేశించారు. కేసుకు సంబంధించిన వివరాలు, గతంలో రెవెన్యూ కోర్టుల్లో ఆ కేసుల విచారణకు సంబంధించిన వివరాల,. ప్రస్తుతం ప్రత్యేక ట్రైబ్యునళ్లలో ఆ కేసుల విచారణ, ఉత్తర్వుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.