ETV Bharat / city

విశాఖలో కూల్చివేతలు.. రాజకీయ కక్షలో భాగమేనన్న బాధితులు

author img

By

Published : Jun 13, 2021, 2:26 PM IST

ఏపీలో ప్రతిపక్ష నాయకుల భూములే లక్ష్యంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని బాధిత నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్‌ సమీపంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ.. జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

vishaka
విశాఖలో కూల్చివేతలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్‌ సమీపంలోని ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆక్రమణలోని భూములు పలువురి అధీనంలో ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. తుంగ్లాంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. భారీగా పోలీసుల బలగాల మధ్య... తెల్లవారుజాము నుంచే రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ చేపట్టారు.

తుంగ్లాంలో ఆక్రమించారని ఆరోపిస్తున్న భూమిని 1992లో 56 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశామని... మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ రావు సోదరుడు పల్లా శంకర్రావు తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది రాత్రి 2 గంటల సమయంలో కూల్చివేయడం దారుణమన్నారు. తన సోదరుడిని వైకాపాలోకి రమ్మని ఆహ్వానించినా వెళ్లకపోయే సరికి అధికార పార్టీ నాయకులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని శంకర్రావు ఆరోపించారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు.

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

ఇదీ చదవండి: ఫామ్​హౌస్​లో సాఫ్ట్​వేర్​ బర్త్​డే పార్టీ.. 55 మందిపై కేసు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.