రేపట్నుంచి రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. వారం రోజులుగా చేస్తోన్న ఆందోళన విరమిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వంగ రవీంద్రరెడ్డి తెలిపారు. తమ కార్యాలయాలకు భద్రత కల్పించేందుకు అదనపు డీజీ జితేందర్ హామీ ఇచ్చారన్నారు.
ఈనెల 4న సజీవ దహనానికి గురైన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించాలని, డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, అటెండర్‌కు మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు రవీంద్రరెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం