‘'లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొంది రాజ్యసభలో తిరస్కరణ గురవడం.. సెలెక్ట్ కమిటీకి పంపడంలాంటి సందర్భాలు ఉన్నాయి. అంతమాత్రాన రాజ్యసభను రద్దు చేయాలనో.. పెద్దల సభ నుంచి సలహాలు, సూచనలు వద్దనో ఏ ప్రధాని చెప్పలేదు. పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందనంత మాత్రాన సభనే రద్దు చేయడం దురదృష్టకరం. కేసీఆర్‌ను నమ్మినవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి.. 2009లో చంద్రబాబుకి కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ను పక్కాగా నమ్మబలికి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు. 2019లో జగన్‌తో జట్టు కట్టారు. ఒక వ్యక్తి నేపథ్యం.. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి. కేసీఆర్ సలహాలను జగన్ పాటిస్తే మాత్రం ఆయనకు భవిష్యత్‌లో చీకటే తప్ప వెలుగు ఉండదు.'
- కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి
- ఇదీ చూడండి : శభాష్ మిత్రమా : వైకల్యాన్ని వీడి.. జెండాగా మారి!