Revanth Tweet to MLC Kavitha: ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్, తెరాసల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ట్విట్టర్ ద్వారా నిరసించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రైతుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్‌లో సంఘీభావం తగదన్నారు. కవిత ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కారణంగానే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.
తెరాస ఎంపీలు పార్లమెంటులో పోరాడటం లేదని.. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని రేవంత్ ట్వీట్ చేశారు. ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సీఎం కేసీఆర్.. గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారని గుర్తు చేశారు. నాడు కేసీఆర్ చేసిన సంతకం.. నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైందని విమర్శించారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయారని కవితనుద్దేశించి ట్విటర్‌లో వెల్లడించారు. రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్పందించిన రేవంత్.. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
-
కవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు.
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?#FightForTelanganaFarmers https://t.co/WtYnUu9hjM
">కవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు.
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2022
ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?#FightForTelanganaFarmers https://t.co/WtYnUu9hjMకవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు.
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2022
ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?#FightForTelanganaFarmers https://t.co/WtYnUu9hjM
ఇదీ చదవండి: Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్.. కవిత కౌంటర్