ETV Bharat / city

కూకట్​పల్లి జోనల్ కార్యాలయం ముందు రేవంత్​రెడ్డి నిరసన - tpcc working precident revanth reddy latest

కూకట్​పల్లి జోనల్ కార్యాలయం వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి నిరసన ప్రదర్శన చేపట్టారు. వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్​ చేశారు. వరద బాధితులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

revanth reddy protest at kukatpally zonal office
కూకట్​పల్లి జోనల్ కార్యాలయం ముందు రేవంత్​రెడ్డి నిరసన
author img

By

Published : Nov 7, 2020, 3:39 PM IST

వరద బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కూకట్​పల్లి జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్​కు వినతిపత్రం అందించారు. రేవంత్​రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని పోలీసులకు సూచించారు. ముట్టడికి వచ్చేరోజు చెప్పే వస్తామని.. ఆ రోజు ఎవరు అడ్డుకుంటారో చూస్తామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు కేవలం కష్టాలు విన్నవించుకోవడానికే వచ్చామని స్పష్టం చేశారు.

అంతకుముందు జోనల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఆపేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా బారికేడ్లను నెట్టుకొని ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి: వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.