కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా... రైతులకు మద్దతుగా మార్చి మొదటి వారంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ రానున్నట్లు రేవంత్ తెలిపారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసన తెలుపుతున్న వారికి మద్దతునిస్తానని రాకేష్ టికాయత్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
దిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద అన్నదాతలకు సంఘీభావం తెలిపిన రేవంత్... అనంతరం రైతు నేత టికాయత్‌ను కలిశారు. రైతులకు మద్దతుగా రాష్ట్రంలో తాను చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ వివరించారు.
ఇదీ చదవండి: ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడతాం: బండి సంజయ్