Restaurant in Rail bhogi: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రజలకు, ప్రయాణికులకు ఓ సరికొత్త ఆకర్షణ వచ్చి చేరింది. స్టేషన్ ప్రాంగణంలో రైల్వేకోచ్ తరహా థీం రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు డివిజన్ డీఆర్‌ఎం ఆర్.మోహనరాజా ఈ కోచ్ రెస్టారెంట్ ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ రకమైన రైల్‌కోచ్ రెస్టారెంట్ మొదటిసారి గుంటూరులో ఏర్పాటైందని ఆయన తెలిపారు. రైలు ప్రయాణికులతో పాటు, సాధారణ ప్రజలకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన అనుభవం పంచేందుకు ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కాలం తీరిన స్లీపర్ కోచ్‌ను రెస్టారెంట్‌గా మార్చినట్లు మోహనరాజా తెలిపారు. ఈ కోచ్‌ను కోచ్ రెస్టారెంట్ అవసరాలకు రీడిజైన్ చేసి లైసెన్స్ మంజూరు చేశామన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాగంణంలో ముందు వైపు దీనిని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న ఆలోచన ద్వారా... రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభవం కలుగుతుందని మోహన రాజ చెప్పారు. వివిధ రకాల వంటకాలను పరిశుభ్రమైన వాతావరణంలో అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పైగా ఆహార పదార్థాల ధరలు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని వివరించారు. ఈ రెస్టారెంట్ 24 గంటలు తెరిచే ఉంటుంది. 'ఫుడ్ ఎక్స్‌ప్రెస్' పేరుతో ఏర్పాటైన రెస్టారెంట్ భోజన ప్రియులకు మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు.
ఇవీ చదవండి: