ETV Bharat / city

తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు.. - తెలంగాణ నీటిపారుదల శాఖ

తెలంగాణలో వినియోగం, నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, బ్యారేజీలలో కలిపి 878 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. ప్రస్తుతం వినియోగిస్తున్న నీటితోపాటు, నిర్మాణంలో ఉన్న జలాశయాల కింద 428.30 టీఎంసీలను సాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు.

Reservoir capacity in Telangana state is 878 TMC
తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు
author img

By

Published : Nov 6, 2020, 6:38 AM IST

తెలంగాణలో ప్రస్తుతం వినియోగిస్తున్న నీటితోపాటు, నిర్మాణంలో ఉన్న జలాశయాల కింద 428.30 టీఎంసీలను సాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు. పారిశ్రామిక అవసరాలకు 88.66 టీంఎసీలు, తాగునీటి అవసరాలకు(మిషన్‌ భగీరథ) 217.13 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. జలాశయాల్లో కనీస మట్టం కింద(డెడ్‌ స్టోరేజీ) 235.51 టీఎంసీలు, వినియోగించుకునేందుకు (లైవ్‌ స్టోరేజ్‌) 634.76 టీఎంసీలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 125 జలాశయాలు ఉండగా వీటిలో 52 ఇప్పటికే పూర్తయ్యాయి. పనులు కొనసాగుతున్నవి 72. వీటిలోనూ కొన్ని చివరి దశలో ఉన్నాయి. ఒకటి ప్రతిపాదనల దశలో ఉంది. కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతలు కలిపి 153 భారీ ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మేరకు ఇటీవల సిద్ధం చేసిన ప్రాజెక్టుల నిర్వహణ విధానం(పీఎంఎస్‌) పోర్టల్లో వివరాలను పొందుపర్చారు.

తొలిసారిగా శాఖ పేరుతో యాజమాన్య హక్కులు

నీటిపారుదల శాఖ పరిధిలోని ఆస్తుల గుర్తింపునకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో శాఖకు చెందిన 12.80 లక్షల ఎకరాల భూముల వివరాలు తేలాయి. ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో పట్టాదారులు, అటవీశాఖ, ప్రభుత్వం నుంచి సేకరించిన భూ విస్తీర్ణం ఇది. వీటిలో భూసేకరణ కింద రైతులకు పరిహారం చెల్లించినా ఏళ్లతరబడి ఈ భూములకు యాజమాన్య హక్కులు మాత్రం రైతుల పేరుతోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన ఆస్తుల గుర్తింపులో ఇంజినీర్ల బృందం దాదాపు ఐదున్నర లక్షల ఎకరాలను శాఖ పేరుతో మ్యుటేషన్లు చేయించడంతో శాఖకు యాజమాన్య హక్కులు లభించాయి.

* శాఖలో చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో భారీ, మధ్య, చిన్న తరహా, నీటి పారుదల అభివృద్ధి సంస్థల పేరుతో విడిగా ఉన్న విభాగాలు త్వరలో ఒకే చోటికి చేరనున్నాయి. జలవనరుల సంస్థగా రూపుదిద్దుకోనున్న ఈ శాఖ నిర్వహణ అంతా ఒకే చోటి నుంచి సాగనుంది. ఈ నేపథ్యంలో శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పీఎంఎస్‌ పేరుతో సిద్ధం చేశారు.

ఇకపై ఎప్పటికప్పుడు మార్పుల నమోదు

నీటిపారుదల శాఖలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా నమోదు చేసేలా పీఎంఎస్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌రావు ఛైర్మన్‌గా ఏర్పాటైన ఐదుగురు సభ్యుల బృందం పర్యవేక్షణలో పీఎంఎస్‌ పట్టాలెక్కింది. భూ సేకరణ, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టులు, జలాశయాలు, నీటి సామర్థ్యం, ఆయకట్టు ఇలా ఏదైనా మార్పులు చోటుచేసుకుంటే నమోదు చేసి పీఎంఎస్‌ ద్వారా నిర్వహణ చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయి ఇంజినీరు నుంచి ముఖ్య ఇంజినీరు వరకు సమాచారం నమోదు చేసేలా తీర్చిదిద్దారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.