ETV Bharat / city

'అప్పులిచ్చేది ఇలాగేనా?'.. ఏపీ బ్యాంకుల తీరుపై ఆర్​బీఐ కన్నెర్ర! - RBI fire on state banks

RBI On State Banks: రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు, ప్రభుత్వరంగ సంస్థలకు బ్యాంకులు అప్పులు ఇస్తున్న తీరుపై రిజర్వుబ్యాంకు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల బడ్జెట్‌ వనరుల నుంచి తిరిగి చెల్లించే పద్ధతిలో అప్పులు ఎలా ఇస్తారని అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులను నిలదీసింది. ఏయే జాతీయ బ్యాంకులు ఏయే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు ఇలా ఎంత మేర అప్పులు ఇచ్చాయో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

RBI
RBI
author img

By

Published : Jul 23, 2022, 12:28 PM IST

RBI On State Banks: రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు, ప్రభుత్వరంగ సంస్థలకు బ్యాంకులు అప్పులు ఇస్తున్న తీరుపై రిజర్వుబ్యాంకు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల బడ్జెట్‌ వనరుల నుంచి తిరిగి చెల్లించే పద్ధతిలో అప్పులు ఎలా ఇస్తారని అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులను నిలదీసింది. రుణవితరణపై 2015లో తాము జారీ చేసిన సర్క్యులర్‌ను ఉల్లంఘించి రుణాలు ఎలా ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏయే జాతీయ బ్యాంకులు ఏయే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు ఇలా ఎంత మేర అప్పులు ఇచ్చాయో పూర్తి నివేదిక సమర్పించాలని రిజర్వుబ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆదేశించారు.

ఈ రుణాలపై బ్యాంకులు బోర్డులకు నివేదిక సమర్పించి సమీక్షించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్‌బీఐ నిబంధనలతో.. ఇచ్చిన రుణాలను పోలుస్తూ మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో బ్యాంకులు తర్జనభర్జనలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తు ఆదాయాలను ఎస్క్రో చేసి బ్యాంకులు రూ.వేల కోట్ల రుణాలను రాష్ట్ర కార్పొరేషన్లకు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న చాలా అప్పులు ఇలాంటివే. ఈ విధానం ఇప్పటికే రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయ్యింది. కేంద్ర ఆర్థికశాఖ కూడా దీనిపై కన్నెర్ర చేసింది. తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌ కొత్త విధానంలో అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ నిధికి వచ్చే ఆదాయానికి కోత పెట్టుకుని, ఆ మొత్తాన్ని కార్పొరేషనే వసూలు చేసుకునే అధికారం కల్పించి, ఆ ఆదాయం ఆధారంగా రూ.వేల కోట్ల అప్పులు తీసుకునే కొత్త ప్రక్రియ రాష్ట్రంలో మొదలైంది. ఈ విధానమూ పెద్ద వివాదంగా మారింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని రిజర్వుబ్యాంకు ఇంత తీవ్రంగా తీసుకోడానికి.. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు చేస్తున్న తీరే పెద్ద కారణమని కూడా కొందరు బ్యాంకర్లు, అధికారులు చెబుతున్నారు.

ఏపీఎస్‌డీసీ.. రూ.1,800 కోట్లకు బ్రేక్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)ను ఏర్పాటుచేసి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే ప్రభుత్వం పెద్దమొత్తంలో రుణాలు తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో పాటు, రుణం తీర్చేందుకు ఎస్క్రో నమూనా ఎంచుకుంది. అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించి ఆ రూపేణా 10 మద్యం డిపోలకు వచ్చే ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి మళ్లించి, దాని ఆధారంగా రూ.25 వేలకోట్ల రుణ సమీకరణకు అడుగులు వేసింది. ఈ హామీ కూడా చాలకపోవడంతో విశాఖ నగరంలోని కలెక్టరేట్‌ లాంటి అనేక ప్రభుత్వ ఆస్తులనూ తాకట్టు పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలను ఎలా తాకట్టు పెడతారనేది పెద్ద వివాదంగా మారింది. కేంద్ర ఆర్థికశాఖ బ్యాంకులపై కన్నెర్ర చేయడంతో ఆ రుణంలో రూ.1,800 కోట్లను రాష్ట్రం ఇప్పటికీ తెచ్చుకోలేకపోయింది.

కొత్త నమూనాతో మరీ దుమారం.. ఎస్క్రో నమూనాకు అడ్డంకులు ఏర్పడటంతో కొందరు కన్సల్టెంట్ల సాయంతో ప్రభుత్వం కొత్తదారులు తొక్కింది. మద్యంపై వ్యాట్‌ను తగ్గించింది. అంటే తన ఖజానాకు వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంది. ఆ మేరకు బెవరేజస్‌ కార్పొరేషన్‌ సెస్‌ రూపంలో వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు చట్టసవరణ చేసింది. అసలు ఒక కార్పొరేషన్‌ ఎలా పన్నులు విధిస్తుంది. ఆ అధికారం ఎక్కడిదనే వివాదం రేగింది. ఆ ఆదాయం ఆధారంగా నాన్‌ డిబెంచర్‌ సెక్యూరిటీల అమ్మకంతో ఇప్పటికే రూ.8,300 కోట్లు తీసుకుంది. మరో రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘనలు సైతం ఉన్నాయని వివాదం రేగింది. ఇది కాకుండా మార్కెట్‌ సెస్‌... మార్కెట్‌ యార్డుల్లో కాకుండా బయట కూడా వసూలు చేసుకునే అధికారం కల్పించి ఆ రూపేణా ఆదాయం చూపించి మార్క్‌ఫెడ్‌ ద్వారా రుణాలు తీసుకోవడం, ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా రుణాల సమీకరణ వంటి అంశాలూ వివాదాస్పదమయ్యాయి.

సొంత కార్యకలాపాలు లేని కార్పొరేషన్లు.. రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డిదోవన రుణాలు తెచ్చుకునేందుకు కార్పొరేషన్లు సహకరిస్తున్నాయి. వాటికి ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయం సృష్టించుకునే మార్గాలు లేవు. ఆ కార్పొరేషన్లు చేసే అప్పులకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి కేటాయింపులు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ నిధి ఆధారంగా ఇప్పటికే రూ.లక్షల కోట్ల అప్పులను రిజర్వుబ్యాంకు నుంచి, ఇతరత్రా మార్గాల్లో రాష్ట్రం సమీకరించింది. ఇప్పుడు ఈ ఆదాయాన్ని మళ్లించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే, ఇప్పటికే అప్పులకు ఆధారంగా చూపిన నిధిని వేరే అప్పులకు ఎలా మళ్లిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆదాయ పరిమితిని దాటి అప్పులు చేసుకుంటూ వెళ్లిపోతే భవిష్యత్తు ప్రమాదం ఏమిటో ఎవరికైనా తెలుసు. పైగా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తే ఇంకెంత ప్రమాదకరం? శ్రీలంక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. ఇప్పుడు రిజర్వుబ్యాంకు కూడా ఈ అప్పుల విషయంలో హెచ్చరికలు చేసింది. జీపీఎఫ్​ సొమ్మును ఎందుకు ఉపసంహరించారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.