ETV Bharat / city

అనంతపురంలో వరద బీభత్సం... ప్రజలను తరలించే పనిలో విపత్తు శాఖ - అనంతపురం తాజా వార్తలు

Rescue Operations In Anantapur Flooded Areas: ఏపీ అనంతపురంలో ప్రకృతి విపత్తుల శాఖ జిల్లా సిబ్బంది ప్రమాదపు అంచున పని చేస్తూ ముంపు బాధితులను రక్షిస్తున్నారు. నగరంలోని 20 కాలనీల్లో నడిమివంక ప్రవాహ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ఇళ్లలోనే ఉండిపోయిన వారిని విపత్తు నిర్వహణ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగంగా చేపట్టారు. ఇప్పటి వరకు వెయ్యి మందిని ముంపునకు గురైన ఇళ్ల నుంచి రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముంపు ప్రాంతాల్లోని ఇళ్లనుంచి రక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రవాహ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, పొరుగు జిల్లాల సిబ్బందిని పిలిపిస్తున్నామంటున్న విపత్తుల నిర్వహణశాఖ జిల్లా అధికారి శ్రీనివాసులుతో ఈటీవీ భారత్ ప్రతినిధి​ ముఖాముఖి.

Rescue Operations In Anantapur Flooded Areas
Rescue Operations In Anantapur Flooded Areas
author img

By

Published : Oct 13, 2022, 3:40 PM IST

అనంతపురంలో వరద బీభత్సం... ప్రజలను తరలించే పనిలో విపత్తు శాఖ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.