ETV Bharat / city

కాంగ్రెస్ త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది: ఉత్తమ్​ - telangana varthalu

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలన చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ ఆరోపించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్​లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

కాంగ్రెస్ త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది: ఉత్తమ్​

author img

By

Published : Jan 26, 2021, 12:27 PM IST

కాంగ్రెస్ త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. బాబాసాహెబ్​ అంబేడ్కర్​ అద్భుత రాజ్యాంగం రూపొందించారని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం పవిత్ర గ్రంథమని.. దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను విభజించి పాలించు విధానం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 60 రోజులుగా దీక్ష చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వానికి మానవత్వం లేదని... మోదీ ప్రభుత్వం పిడికెడు మంది కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని ఆగ్రహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్​లో ఉత్తమ్​ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.

వీరమరణం చెందిన కర్నల్ సంతోష్​కు మహావీర్ చక్ర ఇవ్వడం పట్ల ఉత్తమ్ సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ఉన్నతమైన అవార్డు ఇవ్వడం తెలంగాణ గర్వించదగ్గ అంశమని చెప్పారు. కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేత లాంటి దుర్మార్గ చర్య ఎప్పుడూ చూడలేదన్నారు. రైతు వ్యతిరేక కేసీఆర్ పాలనపై నిరంతర పోరాటం చేస్తామని.. భాజపా, తెరాస లోపాయకారి ఒప్పందంతో కాంగ్రెస్​ను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడే భాజపా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం, తెరాస, భాజపాకు లబ్ది చేకూరేలా చేస్తున్నాయని.. ఎన్ని చేసినా 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఫిల్మ్​సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.