ETV Bharat / city

ఆపదలో నిట్టూర్పు.. అది చాల్లే వీరికి పిలుపు - relief riders in Hyderabad

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలే అన్నీ చేయాలి అంటే కుదరదు.. బాధితులకు మనమూ సాయం అందించాలంటున్నారు రిలీఫ్‌ రైడ్‌ సభ్యులు. అన్నట్లుగానే.... వృద్ధులకు, వికలాంగుల కావాల్సిన అత్యవసర మందులు, ఆహారాన్ని సైకిళ్లపై వెళ్లి అందిస్తున్నారు. ఓ వైపు బాధితులను ఆదుకుంటూనే... పరోక్షంగా పర్యావరణాన్ని కాపాడాలనే తమ లక్ష్యాన్ని సైకిళ్లపై ప్రయాణిస్తూ ప్రదర్శిస్తున్నారు.. హైదరాబాద్‌కు చెందిన సైక్లింగ్‌ బృందాల సభ్యులు.

relief riders, relief riders in Hyderabad
రిలీఫ్ రైడర్స్, హైదరాబాద్​లో రిలీఫ్ రైడర్స్
author img

By

Published : May 15, 2021, 9:24 AM IST

రిలీఫ్ రైడర్స్

కరోనా రెండో దశ విజృంభణలో రోజు వేల మంది కొత్తగా వ్యాధి బారినపడుతున్నారు. వాళ్లలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ... చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్లు బయటకు వెళ్లి అత్యవసర ఔషధాలు, ఆహారం తెచ్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలుస్తోంది.. రిలీఫ్‌ రైడర్స్.

ఉచితంగా ఔషధాలు

కొవిడ్‌ బాధితులకు.. ముఖ్యంగా వృద్ధలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్న శాంతను... ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా... వృద్ధులు, దివ్యాంగులతో పాటు కొవిడ్‌ సోకిన వారికి అండగా నిలుస్తున్నారు. వాటికి కావాల్సిన ఔషధాల్ని ఉచితంగా సమకూర్చుతున్నారు.

రిలీఫ్ రైడర్స్

భాగ్యనగరంలోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న..... శాంతన సెల్వన్‌ పర్యావరణ పరిరక్షణ భాగంగా సైక్లింగ్‌ గురించి ప్రచారం చేస్తుండే వాడు. ఈ సంస్థ ఏర్పాటు ఆలోచన వచ్చినప్పుడు... వాళ్లతో సంప్రదించగా... సైక్లింగ్‌ బృందాలకు చేరవేయగా చాలా మంది స్పందించారు. తాము ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ ముందుకు వచ్చారు. అలా ఏర్పాడిందే... రిలీఫ్‌ రైడర్స్‌.

కొవిడ్ బాధితులకు మందులు

నగరంలోని వేరువేరు ప్రాంతాల్లో, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నా.. వీరంతా బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో రిలీఫ్‌ రైడర్స్‌ సేవలు కొనసాగిస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు, వయోవృద్ధులకు చేయూతనందిస్తున్నారు. నగరమంతటా విస్తరించి ఉన్న.. సైకిల్‌ రైడింగ్‌ సభ్యులు కొవిడ్ బాధితుల ఇళ్లకు... నేరుగా ఔషధాలను చేరవేస్తున్నారు. ఇందుకోసం... కేవలం సైకిళ్లనే వినియోగిస్తుండడం వీరి ప్రత్యేకత.

5 మందితో మొదలై..

ప్రారంభంలో 5 మందితో మొదలుకాగా...నేడు 140 మందికి పైగా సభ్యులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. బాధితులు... వీళ్లను సంప్రదించిన వెంటనే వాళ్లకు దగ్గర్లోని మందుల దుకాణం నుంచి ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే...ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు ఉచిన సరఫరానే చేస్తున్నా...ఔషధ ఖర్చులను తీసుకుంటున్నారు. వాటిని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదల అవసరాలకు వినియోగిస్తున్నారు.

వీరు చేస్తున్న సేవలకు మెచ్చిన కొంత మంది తామూ భాగస్వాములం అవుతామంటూ ముందుకు వస్తున్నారంటున్నారు ఈ బృంద సభ్యులు. ఇంకొంత మంది ఆర్థికంగా కూడా ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.

రోజూ వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 ఫోన్లు వస్తుండగా.. వారందరికీ సాయం అందిస్తోంది... రిలీఫ్ రైడర్స్‌. కేవలం.. ఆహారం, ఔషధాలే కాకుండా.... బాధితుల అవసరాలు తీర్చేలా... ఆక్సిజన్‌ సరఫరా కూడా చేస్తున్నారు. తమ కష్టాన్నికి.... సేవలు పొందిన వాళ్లు చివర్లో చెప్పే కృతజ్ఞతలు ఎంతో ఆత్మసంతృప్తినిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు తమతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.