రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5 వేల కోట్లు విడుదల చేయగా... తెలంగాణకు రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,222.71 కోట్ల పరిహారం అందనుందని వెల్లడించింది.
91 శాతం లోటు భర్తీ
రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 91 శాతం లోటును భర్తీ చేశామని స్పష్టం చేసింది. అలాగే... రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది.