ETV Bharat / city

ముగిసిన అలుపెరగని కార్మిక యోధుడి ప్రస్థానం

కార్మిక నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. శ్రమజీవుల కోసం నిరంతరం తపించిన ఆయన్ను.. 'కార్మికనేత నర్సన్న' అని అంతా అపాయ్యంగా పిలుచుకునేవారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో నాయిని చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాసలో చేరిన ఆయన.. రాష్ట్రం సాకారమయ్యే వరకూ ఉద్యమబాటలో నడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా... రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంమంత్రిగా సేవలందించారు.

ముగిసిన అలుపెరుగని కార్మిక యోధుడి ప్రస్థానం

author img

By

Published : Oct 22, 2020, 2:03 AM IST

Updated : Oct 22, 2020, 4:28 AM IST

ముగిసిన అలుపెరగని కార్మిక యోధుడి ప్రస్థానం

ముక్కుసూటితనానికి, పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనం నాయిని నర్సింహారెడ్డి. శ్రమజీవుల కోసం నిరంతరం తపించిన కార్మిక పక్షపాతి. కార్మికనేతగా నాయిని సుపరిచితుడు. అందరూ ఆయన్ని "కార్మికనేత నర్సన్న" అని అభిమానంతో పిలిచేవారు. ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘాల నేతగా బడుగుజీవుల కోసం పనిచేశారు.

నేరుడుగొమ్ములో జననం..

నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12న.... నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ములో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి. 1970లో నాయిని హైదరాబాద్‌కు వచ్చారు. వీఎస్​టీ కార్మికసంఘం నేతగా పలుమార్లు ఎన్నికయ్యారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ తొల, మలిదశ ఉద్యమాల్లో నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. తెరాస అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన మలిదశ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా..

ముషీరాబాద్ శాసనసభ్యుడిగా నాయిని నర్సింహారెడ్డి మూడుసార్లు విజయం సాధించారు. 1978లో టి.అంజయ్యపై గెలిచారు. ముషీరాబాద్ నుంచి 1985, 2004లోనూ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2001లో నాయిని నర్సింహారెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతిదశలో కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు.

తొలి హోంమంత్రి...

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు పనిచేశారు. నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్యరెడ్డి. ఆయనకు కుమారుడు దేవేందర్‌ రెడ్డి, కుమార్తె వి.సమత రెడ్డి ఉన్నారు.

ఇవీచూడండి: బుల్లెట్ నర్సన్న కన్నుమూత.. శోకసంద్రంలో తెరాస శ్రేణులు

Last Updated : Oct 22, 2020, 4:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.