ETV Bharat / city

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత సరళతరం

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సరళతరం చేయనుంది. వివిధ క్యాటగిరిలకు సంబంధించిన 14 రకాల ఐచ్ఛికాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పెండింగ్‌లో ఉన్న 14వేలకుపైగా మ్యూటేషన్ల ధరఖాస్తులను పరిష్కరంపైనా ప్రత్యేక చర్యలు తీసుకుటోంది. రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాలకు రాలేని వృద్ధులు, బిల్డర్లు, ఎన్​ఆర్​ఐల కోసం ప్రత్యేక ఐచ్ఛికాలను రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేస్తోంది.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు  మరింత సరళతరం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత సరళతరం
author img

By

Published : Dec 2, 2020, 4:36 PM IST

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం జరుగుతున్న కసరత్తులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో బాగంగా వివిధ క్యాటగిరిలకు సంబంధించి 14 రకాల ఐచ్ఛికాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రధానంగా బిల్డర్లు తమ వద్ద ఉన్న ప్లాట్లు అన్నింటిని ఒకేసారి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ప్రత్యేకంగా ఒక ఐచ్ఛికాన్ని అందుబాటులోకి తెస్తోంది.

మరో ఆప్షన్...

అదే విధంగా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు రాలేని వృద్ధులతో పాటు ఇతర వర్గాల కోసం ప్రత్యేకంగా మరో ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇక్కడ ఆస్తులు ఉండి ఇతర దేశాల్లో ఉన్న నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రత్యేకంగా ఐచ్ఛికం తెచ్చింది. ఇలా ఒక్కో క్యాటగిరికి ఒక్కో రకం ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఆన్​లైన్ ద్వారా...

విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎన్​ఆర్​ఐలు తమ ఆస్తులకు సంబంధించి అన్‌లైన్‌ ద్వారా నిర్దేశించిన ఫామ్‌ని నింపాల్సి ఉంటుంది. అందులో వారి పూర్తి వివరాలు, పాస్‌పోర్టు వివరాలు, ఎంతకాలం నుంచి ఏ దేశంలో ఉంటున్నారు? తదితర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

సక్రమంగా ఉంటే...

ఆ వివరాలను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు పంపించి... స్పెషల్‌ బ్రాంచి పోలీసుల ద్వారా పరిశీలన చేయిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధరించుకున్న తరువాత ఆ ఎన్‌ఆర్‌ఐలు బంధువులు కానీ, స్నేహితులకు కానీ జీపీఏ ఇచ్చి ఆస్తులకు సంబంధించిన పాసు పుస్తకాలు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

14వేలకు పైగా వినతులు...

ఇక ఇప్పటికే ఆస్తులు క్రయవిక్రయాలు పూర్తి చేసుకుని మ్యూటేషన్‌ కాని ఆస్తులకు సంబంధించి ప్రభుత్వానికి 14వేలకుపైగా వినతులు అందాయి. వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆస్తుల క్రయవిక్రయాలు పూర్తి చేసుకొని పత్రాలు ఉండి పేరు మార్పు లేని ఆస్తుల సమస్య పరిష్కరానికి ప్రత్యేక విధానం అవలంభించాలని భావిస్తున్నారు.

మరుసటి రోజు నుంచే...

ఈ నెల 3న న్యాయస్థానంలో పెండింగ్‌ ఉన్న కేసు పరిష్కారమైతే మరుసటి రోజు నుంచే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

ఇవీ చూడండి: హస్తం ఆశలన్నీ ఆ నియోజకవర్గంపైనే.. అక్కడ గెలిస్తే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.