ETV Bharat / city

Regional Ring Road Hyderabad : ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.7,512 కోట్లు! - హైదరాబాద్​లో ప్రాంతీయ రింగు రోడ్డు

Regional Ring Road Hyderabad : హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు వెలుపల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగానికయ్యే వ్యయాన్ని కేంద్రం అంచనా వేసింది. భూసేకరణకు రూ.3వేల కోట్లు, రహదారి నిర్మాణానికి రూ.4,152 కోట్లు కలిపి మొత్తం రూ.7,152 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్ర సర్కార్​కు తెలిపింది.

Regional Ring Road, రీజినల్ రింగ్ రోడ్డు
ప్రాంతీయ రింగు రోడ్డు
author img

By

Published : Dec 21, 2021, 7:53 AM IST

ఆర్‌ఆర్‌ఆర్‌

Regional Ring Road Hyderabad : రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి రూ.7,512 కోట్ల వ్యయం అవుతుందని తాజాగా కేంద్రం అంచనా వేసింది. భూసేకరణకు రూ.3 వేల కోట్లు, రహదారి నిర్మాణానికి రూ.4,512 కోట్లు వ్యయం కావచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే.

6 వరుసల్లో నిర్మాణం..

Regional Ring Road Hyderabad expenditure : 158 కిలోమీటర్ల ఈ మార్గం ‘ఎన్‌హెచ్‌ 166 ఏఏ’ (సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- యాదాద్రి- భువనగిరి- చౌటుప్పల్‌)ని ఆరు వరుసల్లో నిర్మించడానికి వీలుగా భూసేకరణ చేపడతారు. తొలుత నాలుగు వరుసల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో మరో రెండు వరుసలు విస్తరిస్తారు. ఇందుకోసం సుమారు 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. అందులో 3,600 ఎకరాలు రహదారి నిర్మాణానికి, 400 ఎకరాలను జంక్షన్ల విస్తరణకు వినియోగిస్తారు. భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు రాష్ట్ర రెవెన్యూశాఖ దస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. అథారిటీ నియామకం పూర్తయ్యాక క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన భూమికి మార్కింగ్‌ చేసి వాస్తవిక విస్తీర్ణాన్ని నిర్ధారిస్తారు. ఆ తరవాత భూసేకరణకు సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేస్తారు. సంక్రాంతి నాటికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, అధికారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని రెవెన్యూ అధికారి ఒకరు సోమవారం ‘ఈనాడు’తో చెప్పారు. భూసేకరణను 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈలోగా రహదారి నిర్మాణానికి గుత్తేదారు ఎంపికకు టెండర్లు ఆహ్వానిస్తారని సమాచారం.

అప్పుడే అనుమతి..

Regional Ring Road Latest Updates : దక్షిణ భాగం రూట్‌ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి పంపింది. ఆ మార్గానికి జాతీయ రహదారి హోదా ఇవ్వాల్సి ఉంది. అనంతరం తుది మార్గం(ఎలైన్‌మెంట్‌) ఖరారుకు మరో దఫా కేంద్రం అధ్యయనం నిర్వహించి.. భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది.

ప్రాంతీయ రింగు రోడ్డు స్వరూపం

  • Hyderabad Regional Ring Road : అవుటర్‌ రింగు రోడ్డుకు 40 కిలోమీటర్ల వెలుపల నిర్మాణం
  • ఉత్తర భాగం సుమారు 158 కిలోమీటర్లు
  • దక్షిణ భాగం 182 కిలోమీటర్లు
  • నిర్మాణవ్యయం సుమారు రూ.17వేల కోట్లు
  • మొత్తం ఆరు వరుసల మార్గం
  • తొలుత నాలుగు వరుసలు.. ఆ తరవాత మరో రెండు వరుసల నిర్మాణం
  • గంటకు 15 వేల వాహనాల రాకపోకలకు అవకాశం ఉన్నట్లు అంచనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.