ETV Bharat / city

నాపై హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర : మంత్రి మల్లారెడ్డి - మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్​పై దాడి

Mallareddy Reaction on Attack : రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో తనపై దాడి ఘటనపై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనపై దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. ఆయన ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే అక్కసుతో తన అనుచరుల ద్వారా దాడి చేయించారని అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ శివారులో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతండగా ప్రజలు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి వెళ్లిపోతుండగా మంత్రి కాన్వాయ్​పై చెప్పులు, కుర్చీలతో దాడి చేశారు.

Mallareddy Reaction on Attack
Mallareddy Reaction on Attack
author img

By

Published : May 30, 2022, 3:33 AM IST

Updated : May 30, 2022, 10:48 AM IST

నాపై దాడి రేవంత్ రెడ్డి కుట్ర : మంత్రి మల్లారెడ్డి

Mallareddy Reaction on Attack : రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై కొందరు దాడికి విఫలయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రెడ్లకు ఏం చేసిందో చెప్పాలని.. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుపై ప్రకటన చేయాలని సభికులు మంత్రిని నిలదీశారు. అర్ధాంతరంగా తన ప్రసంగాన్నిముగించుకుని వెళ్తుండగా మంత్రి కాన్వాయ్‌పై కుర్చీలు విసిరి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

Attack on Minister Mallareddy
మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్​పై దాడి

ఈ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనపై దాడి వెనుక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఆయన ప్రజావ్యతిరేక చర్యలను బహిరంగంగా ప్రశ్నించినందుకే ఈ కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

రేవంత్‌ను ప్రశ్నిస్తున్నందుకే..

‘తెరాస సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని సభలో చెప్పా. రేవంత్ మొదటి నుంచి చేసే పని ఇదే కదా. ఒక్క రెడ్డిలను పట్టుకునే మొదట బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎవరినీ వదలడు ఆయన. సభలో అన్ని చెప్పి వస్తుంటే చివర ఒక 100 మంది గుండాలను పెట్టి చంపాలనుకున్నాడు. నన్ను 8 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నన్ను హత్య చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారు. రెడ్డి సింహగర్జన సభలో నాపై దాడి చేసేందుకు కుట్ర. ఎంపీ రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతాం. నాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్‌ కంకణబద్ధులై ఉన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. రెండేళ్లలో కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని నేను వివరించాను. రెడ్లకు న్యాయం జరుగుతుందని చెబుతుండగా నినాదాలు చేశారు.' -మల్లారెడ్డి, మంత్రి

Attack on Minister Mallareddy: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి వాహన శ్రేణిపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ శివారులో ఆదివారం సాయంత్రం రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి ప్రసంగాన్ని కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా, వెంబడించి.. ఆయన వాహనశ్రేణిపై కుర్చీలు, చెప్పులు విసిరారు. ఈ సభకు రెడ్ల ఐకాసతోపాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో సభికుల వ్యతిరేక నినాదాలు, అరుపులతో గందరగోళం నెలకొంది. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జేఏసీ సభలో డిమాండ్‌ చేసింది. ఈ విషయాన్ని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రామిరెడ్డి, రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డిలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ఇతర ఓసీ సామాజికవర్గ సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. ఓసీ విద్యార్థులకు విదేశాల్లో విద్యాభ్యాసం కోసం రూ.25 లక్షల ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు. సంఘ నాయకులు మాట్లాడిన తరువాత మంత్రి మల్లారెడ్డి ప్రసంగించారు.

అడుగడుగునా వ్యతిరేక నినాదాలు... స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు ప్రతి పల్లెలో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుదలకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. ఆసరా, రైతుబీమా, రైతుబంధు, దళితబంధు పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి చెబుతుండగా... మాట్లాడటం ఆపాలంటూ సభికుల నుంచి అరుపులు మొదలయ్యాయి. దీంతో మంత్రి ప్రసంగం ముగించి వేదిక నుంచి కిందికి దిగారు.

కుర్చీలు, రాళ్లతో దాడి... మంత్రి బయటకు వెళ్తుండగా, నిరసనకారులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంబడించారు. మంత్రి వాహనశ్రేణి వెనుక పరుగెడుతూ కుర్చీలు, చెప్పులు, నీళ్ల సీసాలు, రాళ్లు విసిరారు. వారిని అదుపు చేస్తూ మంత్రి వాహనాలను సురక్షితంగా బయటకు పంపడానికి పోలీసులకు సుమారు 15-20 నిమిషాల సమయం పట్టింది.

రెడ్ల సింహగర్జన సభలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహారెడ్డి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర సలహాదారులు పెండ్యాల రాంరెడ్డి, రెడ్డి జేఏసీ కో-ఛైర్మన్‌ కొట్టెం మధుసూదన్‌రెడ్డి, మూడుచింతలపల్లి జడ్పీటీసీ సభ్యుడు (కాంగ్రెస్‌) సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, జేఏసీ ప్రతినిధులు కంకడాల సరోజిని, డీకే వసంతారెడ్డి, సతీశ్​ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:మంత్రి మల్లారెడ్డిపై రెడ్ల ఆగ్రహం.. చెప్పులు, రాళ్లు, కుర్చీలతో దాడి..

Last Updated : May 30, 2022, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.