ETV Bharat / city

ఎర్రచందనం అక్రమ రవాణా... పట్టుబడ్డ ముగ్గురు నిందితులు

ఎర్ర చందనం అక్రమ రవాణా నిందితుల్లో గ్రామ వాలంటీర్ ఉండడం చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా చెర్లోపల్లి - అలిపిరి మార్గంలో దుంగలు తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని... ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Breaking News
author img

By

Published : Jul 29, 2020, 1:57 PM IST

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుపతి పరిసరాల్లోని చెర్లోపల్లి - అలిపిరి మార్గంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్​ఫోర్స్ పోలీసులు దుంగలు రవాణా చేస్తున్న ఆటోను పట్టుకున్నారు. 5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో ఒకడైన నితీశ్ చౌదరి పుదిపట్ల.. గ్రామ వాలంటీర్​గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పుదిపట్ల పంచాయతీ అధికారులు.. నితీశ్​ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఇద్దరూ సోమల మండలానికి చెందిన నాగరాజు, రవిగా గుర్తించారు. వీరు శ్రీనివాసులురెడ్డి అనే ప్రధాన స్మగ్లర్ అనుచరులుగా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఇవీ చదవండి:

డా.సినారె సారస్వత సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.