మహాశివరాత్రి నాడు ఆ త్రినేత్రుడికి వేడుకగా ఉత్సవాలు జరుపుతారు. రాత్రంతా ఆ గరళకంఠుడిని స్మరిస్తూ జాగారం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో శివరాత్రి వేడుకల్లో అమ్మాయిలతో రికార్డింగ్ డాన్సులు చేయించారు.
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ట్రాక్టర్‌పై నృత్యాలు చేయిస్తూ.. ఊరూరా తిప్పారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని పలువురంటున్నారు.
ఇదీ చదవండీ.. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు