ETV Bharat / city

Balapur laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?

మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ

author img

By

Published : Sep 19, 2021, 10:21 AM IST

Updated : Sep 19, 2021, 1:21 PM IST

09:20 September 19

మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ

మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ

భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో కీలకఘట్టమైన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో.. లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్​ లడ్డూను 18.90 లక్షలకు ఏపీ ఎమ్మెల్సీ రమేశ్​ యాదవ్ ఆయన స్నేహితుడు మర్రి శశాంక్​ రెడ్డితో కలిసి దక్కించుకున్నారు. లడ్డూ వేలంపాటను కోనేటి లక్ష్మణ రావు ప్రారంభించారు. 

తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వేలంలో పాల్గొన్నట్లు లడ్డూ దక్కించుకున్న వారిలో ఒకరైన ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్నారు. శశాంక్‌ రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

1994 నుంచి కొనసాగుతున్న బాలాపూర్ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా వ్యాప్తి వల్ల జరగలేదు. ఈయేడు రెట్టింపు ఉత్సాహంతో వేలంపాటలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపారు. బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 2019లో రూ.17.60 లక్షలకు ఈయన లడ్డూను దక్కించుకున్నారు. ఆ నగదును ఉత్సవ సమితి రాంరెడ్డికి అందించింది. 

స్థానికులు, స్థానికేతలకు మధ్య జరిగిన రసవత్తర వేలంపాటలో 2019 కంటే లక్షా 30 వేలకు అదనంగా పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు.

వేలం పాటలో లడ్డూ కైవసం చేసుకున్న అనంతరం నిర్వాహకులకు నగదు అందజేశారు. వేలం పాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా... స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. డబ్బు కట్టిన తర్వాత లడ్డూ దక్కించుకున్నవారికి నిర్వాహకులు లడ్డూ అందజేశారు.

బాలాపూర్ లడ్డూ వేలంపాటకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.  రాష్ట్రంలో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంత ప్రాధాన్యం కలిగింది బాలాపూర్ గణేశుడికే. నగరంలోని ప్రధాన వీధుల గుండా భజన బృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి మధ్య బాలాపూర్ గణపతికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ కూడలి వద్ద ఆపి.. వేలం పాట నిర్వహించారు. 

లడ్డూ వేలంపాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను సంతరించుకున్న బాలాపూర్ గణేశుడు... తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలమూలల ఉన్న తెలుగువారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. బాలాపూర్‌ లడ్డూ దక్కించుకున్నవారి ఇంట సిరిసంపదలతోపాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది.

Last Updated : Sep 19, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.