ETV Bharat / city

ఐఏఎస్​ అధికారి... ప్రతిపక్షాలపై నిందలేస్తారా..?

హైకోర్టులో ప్రభుత్వం సమర్పించిన ఆర్టీసీ అఫిడవిట్‌పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సర్కార్​ను అస్థిర పరిచేందుకు ఎలాంటి కుట్రలు చేశామో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశాయి. అఫిడవిట్‌ను ధర్మాసనం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరాయి.

author img

By

Published : Nov 18, 2019, 6:13 AM IST

ఐఎఎస్​ అధికారి... ప్రతిపక్షాలపై నిందలేస్తారా..?

అఫిడవిట్‌పై అభ్యంతరాలు

కేసీఆర్​ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న దురుద్దేశంతో ఆర్టీసీ యూనియన్‌, విపక్షాలు పన్నాగం పన్నాయని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి.

దమ్ముటే నిరూపించండి: భాజపా సవాల్​

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా ఏం చేసిందో ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్‌ శర్మ నిరూపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సునీల్‌శర్మ వేసిన అఫిడవిట్ చూస్తుంటే తెరాస ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. తెరాస నిరంకుశ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుంటే ప్రతిపక్షాలపై నెపం వేస్తున్నారని మండిపడ్డారు.

" ఆయన ఐఏఎస్‌ అధికారా? లేక తెరాస ప్రధాన కార్యదర్శా?.. ఒక ఐఏఎస్‌ అధికారి ఇంతలా దిగజారడం ఎక్కడా చూడలేదు. అఫిడవిట్‌లో సునీల్‌ శర్మ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి" - లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అలాంటి ఆలోచన చేయలేదు..
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్‌ ఎలాంటి ఆలోచన చేయలేదని పీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సునీల్‌ శర్మ వేసిన అఫిడవిట్‌ను సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఎవరి ప్రోద్బలంతో తప్పుడు సమాచారంతో హైకోర్టులో అఫిడవిట్‌ వేశారని ప్రశ్నించారు.

ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోండి...

అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని కాంగ్రెస్‌, భాజపా పేర్కొన్నాయి. కుట్రలు పన్నినట్లు ఆధారాలుంటే అరెస్ట్‌ చేయాలని... లేదంటే సునీల్‌ శర్మను డిస్మిస్‌ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఓ ఐఎఎస్​ అధికారి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని చెప్పడం సరికాదని అన్నారు. సునీల్‌శర్మపై లోక్‌సభలో కూడా చర్చ లేవనెత్తుతామన్న ఉత్తమ్‌...డిఓపిటికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ అధికారుల వైఖరి వల్లే సమ్మె చేస్తున్నాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.