ETV Bharat / city

Sidharth Shukla: సిద్దార్థ్​ శుక్లా మృతికి కారణమేంటి?

బాలీవుడ్​ నటుడు సిద్దార్థ్​ శుక్లా (Sidharth Shukla died) మరణం సినీ పరిశ్రమను షాక్​కు గురిచేసింది. ఆయన గురువారం వేకువ జామున 3 గంటలకు ఛాతి నొప్పితో ఇబ్బందిపడినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన తల్లి ఇచ్చిన నీళ్లు తాగి.. తిరిగి పడుకున్న సిద్దార్థ్​.. నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Sep 3, 2021, 5:06 PM IST

Sidharth Shukla
Sidharth Shukla

ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా(40) (Sidharth Shukla died) మరణ వార్త విని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబయిలోని ఆస్పత్రికి తీసుకురాకమునుపే సిద్దార్థ్​ చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే సిద్దార్థ్ మరణానికి గల కారణంపై వైద్యులు స్పష్టతనివ్వలేదు. శవ పరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.

సిద్ధార్థ్​ మృతదేహాన్ని క్యాజువాలిటీ వార్డులో మూడుసార్లు పరీక్షించారు. సిద్దార్థ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని నిర్ధరించారు. ఇద్దరు పోలీసుల సమక్షంలో గురువారం మధ్యాహ్నం 3.45 నిమిషాలకు పోస్ట్‌మార్టం చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసినట్లు సమాచారం.

"వేకువజామున 3 గంటల ప్రాంతంలో సిద్దార్థ్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాతి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తల్లికి చెప్పారు. దీంతో ఆమె తాగడానికి నీళ్లు ఇస్తే.. అవి తాగి మళ్లీ పడుకున్నారు. అయితే ఉదయం చాలా సమయం అయినా సిద్దార్థ్​ నిద్ర లేవలేదు. సిద్దార్థ్​ను లేపేందుకు ఆయన తల్లి ప్రయత్నించినా.. ఉలుకూ పలుకు లేదు. దీంతో సిద్దార్థ్​ సోదరిని పిలిచారు. సిద్దార్థ్​ సోదరి.. డాక్టర్​కు ఫోన్​ చేసి సమాచారం అందించారు. దీంతో అక్కడికి వచ్చిన డాక్టర్​.. సిద్దార్థ్​ మరణించినట్లు నిర్ధరించారు. వెంటనే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ క్రమంలో ముంబయిలోని కూపర్ ఆస్పత్రికి ఉదయం 10.30 గంటలకు సిద్దార్థ్​ను తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రి వైద్యులు కూడా ఆయన ముందే చనిపోయినట్లు వెల్లడించారు" అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

వైద్యులు వద్దన్నా..

సిద్దార్థ్​కు రోజుకు మూడు గంటలకుపైగా వ్యాయామం, ధ్యానం చేసే అలవాటు ఉంది. అయితే అతడి ఆరోగ్యం దృష్ట్యా ఈ సమయాన్ని తగ్గించాలని వైద్యులు పలుమార్లు సూచించినట్లు సమాచారం.

నటుడిగా..

మోడల్​గా పరిచమైన సిద్దార్థ్ (sidharth shukla age).. బుల్లితెర సీరియల్ బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) (balika vadhu cast)తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఝలక్ దిఖ్లా జా 6', బిగ్​బాస్ 13 (bigg boss siddharth shukla)షోలో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు. బాలీవుడ్​ బిగ్​బాస్​ 13వ సీజన్​లో విజేతగానూ నిలిచారు. అలాగే కరణ్ జోహర్ నిర్మించిన 'హంప్టీ శర్మా కీ దుల్హానియా' చిత్రంలో సహాయ నటుడి పాత్రలో మెరిశారు.

ఇదీ చూడండి : Sidharth Shukla Death: సిద్దార్థ్​ అంత్యక్రియలు.. ప్రేయసి కన్నీటి వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.