ETV Bharat / city

కత్తి మహేశ్​ను సీటు బెల్టే మోసం చేసిందా?

author img

By

Published : Jul 11, 2021, 3:45 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కత్తి మహేశ్ మరణానికి ప్రధాన కారణం ఏంటి? కంటికి గాయమైందని, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినా చివరికి కత్తి మహేశ్ ప్రాణాలొదలటానికి కారణాలేంటి? అసలు ప్రమాదం జరిగిన రోజు ఏమైంది?

కత్తి మహేశ్​
kathi mahesh

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ విజయవాడ నుంచి పీలేరుకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. హైవేపై లారీ ఒక్కసారిగా రాంగ్ ట్రాక్​లోకి రావటం వల్లే ప్రమాదం జరిగిందని కత్తి మహేశ్ కారు డ్రైవర్ సురేశ్ చెప్పారు. యాక్సిడెండ్​ జరిగిన సమయంలో కత్తి మహేశ్​ సీట్​బెల్ట్​ ధరించలేదని... అందువల్లే బలమైన గాయాలయ్యాయని ఆయన అన్నారు.

సీటు బెల్టు ధరించిన తనకు పెద్దగా గాయాలవలేదని, ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపిన సురేశ్.. ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేశ్​ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించామన్నారు. కన్ను దగ్గర పెద్ద గాయం అవడం వల్ల.. మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు.

కత్తి మహేశ్ వైద్యం కోసం ఏపీ సీఎం జగన్ సీఎంఆర్​ఎఫ్​ నుంచి 17లక్షలు మంజూరు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో నేడు అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇదీ చూడండి: kathi mahesh: నేడు యర్రావారి పాలెంలో కత్తి మహేశ్​ అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.