ETV Bharat / city

'రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం కుదేలు చేసింది'

ఎల్ఆర్ఎస్​తో సంబంధం లేకుండా పాత లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్​ రియల్టర్ అసోసియేషన్ హైదరాబాద్​లో ఆందోళనకు దిగింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్​లోని కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఐజీ శేషాద్రికి అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ వినతి పత్రం సమర్పించారు.

Realtors Dharana At Registration Office in hyderabad
'రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం కుదేలు చేసింది'
author img

By

Published : Jan 10, 2021, 8:08 AM IST

సజావుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం కుదేలు చేసిందని తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్​, ధరణి పేర్లతో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ.. రిజిస్ట్రేషన్లను ఆపివేసిందన్నారు. పాత వెంచర్లలో మిగిలిపోయిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు ఆపి రియల్టర్లపై పెనుభారం మోపిందని పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్​లోని కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి.. ఐజీ శేషాద్రికి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్ చేసిన వెంచర్ ఓనర్లందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగలోపు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆలేరు యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.