Vinod kumar on RBI report: గడచిన ఐదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్యరంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలే పేర్కొందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో రికార్డ్ సృష్టిస్తూ గత ఐదేళ్లలో రూ.1.81 లక్షల కోట్ల సంపదను సృష్టించిన విషయాన్ని ఆర్బీఐ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అంకితభావ పనితీరుకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని వినోద్ కుమార్ కొనియాడారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించలేదంటున్న వారికి ఆర్బీఐ నివేదికనే నిదర్శనమన్నారు. 2017-18లో 95,098 కోట్లుగా ఉన్న ఈ మూడు రంగాల ఉత్పత్తుల విలువ 2021-22 నాటికి ఏకంగా 1,81,702 కోట్లకు పెరిగినట్లుగా ఆర్బీఐ వెల్లడించిందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందించేందుకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్న ఆయన ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చుచేసినట్టు వివరించారు.
ఇవీ చదవండి: