ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని పిటిషన్‌లో కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు వేసింది.
ఇదీ చదవండీ... ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ