ETV Bharat / city

అప్పుగా తెచ్చుకున్న డబ్బు.. ముక్కలు ముక్కలైన నోట్లు.. ఏం జరిగిందంటే.?

RATS DESTROY MONEY: ఓ సామాన్య రైతు.. తన కుటుంబ అవసరాల కోసం ఓ షావుకారు వద్ద కొంత డబ్బును అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి చెక్కపెట్టెలో జాగత్త్రగా దాచిపెట్టాడు. రెండు రోజుల తర్వాత చూస్తే అవి ముక్కలు ముక్కలుగా కనిపించాయి. దీనికంతటికీ కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదవండి..

RATS DESTROY MONEY
RATS DESTROY MONEY
author img

By

Published : Oct 2, 2022, 8:31 PM IST

అప్పుగా తెచ్చుకున్న డబ్బు.. ముక్కలు ముక్కలైన నోట్లు.. ఏం జరిగింది..?

RATS DESTROY MONEY: ఏపీలోని ప్రకాశం జిల్లాలో అగస్టిన్ అనే మధ్యతరగతి రైతు.. పొలం పెట్టుబడులకు, కోడలి ప్రసవ ఖర్చుల కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.70 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును జాగత్రగా ఇంటికి తీసుకొచ్చి.. అంతే జాగ్రత్తగా చెక్కపెట్టెలో భద్రపరిచాడు. రెండు రోజుల తర్వాత చెక్కపెట్టెలో ఉన్న డబ్బును భార్యను తీసుకురమ్మనగా తాళం తీసి చూసిన ఆమె.. విస్మయానికి గురైంది. కారణం.. అవి ముక్కలు ముక్కలుగా ఉండటం. ఆ చినిగిపోయిన ముక్కలనే తీసుకెళ్లి భర్త చేతిలో పెట్టింది. అది చూసిన అగస్టిన్​ బోరున విలపించాడు.

అప్పుగా తీసుకున్న డబ్బు ఇలా ముక్కలు ముక్కలు కావడం.. తన కోడలికి ప్రసవం దగ్గర పడుతుండటంతో ఏం చేయాలో తెలియక గుండెలవిసేలా రోధిస్తున్నాడు. ఇంతకీ ఆ డబ్బులు ఎలా ముక్కలు అయ్యాయో చెప్పలేదు కదా.. ఎవరంటే మూషికరాజు. అవును మీరు విన్నది నిజమే.. ఈ పని చేసింది ఎలుకలే.. ఈ ఘటన జిల్లాలోని ముండ్లమూరు మండలం బృందావనం కాలనీలో జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.