ETV Bharat / city

AP Ration dealers protests: ఆగని రేషన్ డీలర్ల ఆందోళన.. నేడు గిడ్డంగుల వద్ద నిరసనలు

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా చౌకధరల దుకాణ డీలర్లు ఆందోళన(AP Ration dealers protests) ఇవాళ కూాడా కొనసాగనుంది. జీవో నంబర్ 10 రద్దు, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని రేషన్​ డీలర్లు సంఘం డిమాండ్ చేస్తోంది.

AP Ration dealers protests
రేషన్ డీలర్ల ఆందోళన
author img

By

Published : Oct 27, 2021, 9:15 AM IST

ఆంధ్రప్రదేశ్​లో రేషన్​ డీలర్ల ఆందోళనలు(AP Ration dealers protests) ఇవాళ కూడా కొనసాగనున్నాయి. జీవో నంబర్ 10 రద్దుతో పాటు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించే వరకు నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ఉన్నతాధికారులతో చర్చలు..

రేషన్ డీలర్ల(AP Ration dealers protests)తో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్​తో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదని.. ఇవాళ గిడ్డంగుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీలర్లు తెలిపారు.

పంపిణీ ఆగదు..

రేషన్ డీలర్లు(AP Ration dealers protests) ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని.. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీలర్లకు సూచించారు.

ఇదీ చదవండి: Huzurabad By Election 2021: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్​ ప్రచారం లేనట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.