హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్టు ఆస్పత్రి ఛైర్మన్, సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన మహిళకు రొమ్ము క్యాన్సర్ శస్త చికిత్స చేసి కాపాడినట్లు పేర్కొన్నారు.
రొమ్ము కాన్సర్తో బాధపడుతూ.. చివరి దశలో బసవతారకం ఆస్పత్రిలో చేరారని.. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్లు బాలయ్య తెలిపారు. ఆపరేషన్ చేయాల్సిన సమయానికి సదరు మహిళ కరోనా బారిన పడ్డారన్నారు. కొవిడ్ నుంచి కోలుతున్న తర్వాత శస్త్ర చికిత్స చేసినట్లు వివరించారు. పూర్తి ఉచితంగా వైద్యం అందించినట్లు బాలయ్య తెలిపారు.
వరద సాయంపై.. సినీరంగ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవీచూడండి: విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం