SNAKE SMUGGLERS ARREST: పూడు పాముల అక్రమ రవాణా చేస్తున్న ముఠాను ఏపీ చిత్తూరు తూర్పు విభాగం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. చిత్తూరు సమీపంలోని చెన్నమ్మగుడిపల్లె సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మంది సభ్యులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్ట్ అధికారి నరేందిరన్ తెలిపారు. నిందితుల వద్ద ఉన్న సంచిని పరిశీలించగా.. అందులో నాలుగున్నర కిలోల బరువైన అరుదైన పామును అధికారులు గుర్తించారు.
ముఠా సభ్యులు.. ఈ పామును తమిళనాడుకు చెందిన పాండురంగన్ గోపాల్ అనే వ్యక్తికి విక్రయించడానికి సిద్ధం చేసినట్లు విచారణలో కనుగొన్నారు. ఈ కేసులో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 13 మంది సభ్యులను అటవీ అధికారులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఒక టవేరా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగున్నర కిలోల బరువు ఉన్న అరుదైన పూడు పాములు భారత్, పాకిస్థాన్, ఇరాన్ దేశాల్లో మాత్రమే లభిస్తాయి.
ఇదీ చూడండి: