ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాస ఆవరణలో.. అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము కలకలం రేపింది. భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో.. ఎంపీ సిబ్బంది హడలిపోయారు. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వడంతో.. వారు చేరుకుని పామును చాకచక్యంగా బంధించారు. అటవీశాఖ రేంజ్ అధికారి గోపాలనాయుడు సూచన మేరకు.. సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో సురక్షితంగా రక్తపింజర పామును విడిచిపెట్టినట్లు.. గ్రీన్ మెర్సీ సీఈవో రమణమూర్తి తెలిపారు.
ఇదీ చూడండి: Organ Donation: ఆడుతూ ఓడినా.. ఏడుగురికి పునర్జన్మనిచ్చాడు