ETV Bharat / city

కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత.. నేతల అరెస్టు...

ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పోరుబాట పట్టింది... ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించిన ప్రదర్శన పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అరెస్టు చేశారు.

కాంగ్రెస్ చలో రాజ్ భవన్​ ర్యాలీలో ఉద్రిక్తత.. నేతల అరెస్టు
author img

By

Published : Nov 8, 2019, 12:42 PM IST

Updated : Nov 8, 2019, 1:33 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ నిరసన బాటపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ శ్రేణులు ప్రదర్శనగా బయల్దేరారు. అనంతరం గవర్నర్‌ తమిళిసైను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్‌ నుంచి వారు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత.. నేతల అరెస్టు...

అరెస్టు చేశారు.. బేగం బజార్ పీఎస్​​ తరలించారు...
పోలీసు వలయాన్ని నెట్టుకొని ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విడతలవారీగా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్​ నేతలను అరెస్టు చేశారు. వీరందరిని బేగం బజార్ పోలీస్ స్టేషన్​ తరలించారు. గాంధీభవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అనుమతి కోరాం.. పోలీసులు పట్టించుకోలేదు

తాము మూడు రోజుల క్రితమే ర్యాలీ కోసం అనుమతికి దరఖాస్తు చేసినప్పటికి.. పోలీసులు పట్టించుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుద్యోగం ఏస్థాయిలో ఉందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తేవాలన్న లక్ష్యంతోనే నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల్లో ప్రధాని, సీఎంలపై వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని... కేసీఆర్​ ప్రజల గొంతును పోలీసు జులుంతో నొక్కుతున్నారని విమర్శించారు.

కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది

Last Updated : Nov 8, 2019, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.