ETV Bharat / city

ఏపీలో విస్తారంగా వర్షాలు.. స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థుల కష్టాలు - రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

RAINS IN AP: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు కష్టాలు పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో కురిసిన వర్షాలకు రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు చేరింది.. దాంతో హిరమండలం వైపు వెళ్తున్న లారీ ఇరుక్కుపోయింది. ఏలూరు జిల్లాలో కాలువలు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

rains-in-andhra-pradesh
rains-in-andhra-pradesh
author img

By

Published : Jul 6, 2022, 5:00 PM IST

ఏపీలో విస్తారంగా వర్షాలు.. స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థుల కష్టాలు

RAINS IN AP: ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. 2, 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా జల్లులు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. చాలాచోట్ల ఉరుములతో జల్లులు పడతాయని సూచించారు.

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు పొంగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ములగలపల్లి, రౌతుగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎలుకల కాలువ చప్టా కొట్టుకుపోయింది. ఐదేళ్లుగా కాల్వ పరిస్థితిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములగలపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లలంటే రౌతుగూడెం విద్యార్థులు ఈ కాలువ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో.. స్థానికుల సహాయంతో విద్యార్థులు కాలువ దాటారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి వద్ద కాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. లబ్బర్తి వద్ద సమీప పొలాల్లోకి నీరు చేరడంతో.. కాలువలోని చేపలు పొలాల్లోకి చేరాయి. స్థానికులు ఉత్సాహంగా చేపలు పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలో లారీ ఇరుక్కుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతల్లో నీరు చేరింది. హిరమండలం వైపు వెళ్తున్న లారీ.. గుంతలో ఇరుక్కుపోయింది. ప్రభుత్వం నూతన రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టకపోవడంతో.. వర్షాల సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.