హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం కురిసింది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, కీసర, రాంపల్లి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, బాలానగర్, చింతల్, గాజులరామరం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లి, మదీనాగూడ, హఫీజ్‌పేట, పాతబస్తీలోని పలు ప్రాంతాలు, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద వర్షం కురిసింది.
కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ, ప్యారడైస్, అల్వాల్, బోయిన్‌పల్లిలో వర్షం కురుస్తుండటంతో నిమజ్జనానికి బయలుదేరాల్సిన గణనాథులు మండపాలకు పరిమితమయ్యారు. రోడ్లపై వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
మొజంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్‌బజార్, హుస్సేన్‌సాగర్, పాతబస్తీ ప్రాంతాలలో మోస్తం వాన(Rain in Hyderabad) పడింది. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షంలో(Rain in Hyderabad)నూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. చిరుజల్లుల్లో తడుస్తూ.. భక్తులు గణపతి ముందు స్టెప్పులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఆకాశమంత మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షం కురిసే అవకాశముందని కొందరు భక్తులు గణేశ్ శోభాయాత్ర నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. భారీ వాన పడితే.. వరదలో చిక్కుకుంటామేమోనని భయంతో వెనుదిరుగుతున్నారు. ఇంకొందరు మాత్రం జల్లుల్లో తడుస్తూ.. గణేశుణ్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.
ఇదీ చదవండి: Ganesh Immersion: వర్షంలోనూ వైభవంగా శోభాయాత్ర... ఒంటిగంట వరకు 231 విగ్రహాల నిమజ్జనం