ఆపరేషన్ స్మైల్-7లో భాగంగా ఈ నెలలో 223 మంది బాల కార్మికులకు రాచకొండ పోలీసులు విముక్తి కలిగించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 100 మంది బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహరాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బంగ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 123 మంది చిన్నారులు ఉన్నారు.

పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి... కమిషనరేట్ పరిధిలో ఇటుక బట్టీలు, ఇళ్ళు, గాజుల పరిశ్రమలు, భిక్షాటన, దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారులను రెస్క్యూ కేంద్రాలకు తరలించారు. మొత్తం 46 మంది నిందితులను అరెస్ట్ చేసి... జునైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి