ETV Bharat / city

'కష్టపడి పని చేసి కమిషనరేట్​కు మంచి పేరు తీసుకురావాలి' - rachakonda cp mahesh bhagavath updates

రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన 98 మంది ఎస్సైలతో సీపీ మహేష్ భగవత్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత వినియోగంపై పట్టు సాధించాలన్నారు. విధుల్లో పాటించాల్సిన నియమాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

rachakonda cp mahesh bhagavath Interacts with 98 newly appointed si's
'కష్టపడి పని చేసి కమిషనరేట్​కు మంచి పేరు తీసుకురావాలి'
author img

By

Published : Oct 31, 2020, 4:25 PM IST

సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిచటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన 98 మంది ఎస్సైలతో నేరేడ్​మెట్​లోని కమిషనర్ కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు. విధుల్లో పాటించవలసిన నియమాలు, క్రమశిక్షణ వంటి అంశాలను వారికి వివరించారు.

వృత్తిలోని వివిధ అంశాలపై పట్టు సాధించాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారికి దిశానిర్దేశం చేశారు. కష్టపడి పని చేసి కమిషనరేట్​కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.