ETV Bharat / city

'మార్గదర్షక్స్​' ధ్రువీకరణ పత్రాలను అందజేసిన సీపీ మహేశ్​ భగవత్

మహిళలు, సమాజ రక్షణ దిశగా వివిధ విషయ నిపుణులు, సలహాదారుల ద్వారా రాచకొండ కమిషనరేట్​లో 159 మంది శిక్షణ పొందారు. వీరందరికీ సీపీ మహేశ్​ భగవత్​ 'మార్గదర్షక్స్​' ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

rachakonda cp mahesh bhagavat awarded police who completed training with marghdarshakh
'మార్గదర్షక్స్​' ధ్రువీకరణ పత్రాలను అందజేసిన సీపీ మహేశ్​ భగవత్
author img

By

Published : Nov 7, 2020, 11:16 PM IST

Updated : Nov 8, 2020, 8:27 AM IST

రాచకొండ కమిషనరేట్​ పరిధిలో 'మార్గదర్షక్స్​' కార్యక్రమంలో శిక్షణ పొందినవారికి ధ్రువీకరణ పత్రాలను సీపీ మహేశ్​భగవత్​ అందజేశారు. 159 మంది ఉన్న పోలీసుల బృందం.. వివిధ విషయ నిపుణులు, సలహాదారుల ద్వారా మహిళలు, సమాజ రక్షణ దిశగా ట్రైనింగ్​ తీసుకున్నారు. మార్గదర్షక్స్​ పోలీసులకు, బాధితులకు మధ్య వంతెనగా ఉండాలని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. కార్యక్రమంలో మహేశ్​ భగవత్​తో పాటు సైబరాబాద్​ సీపీ వీసీ సజ్జనార్​ పాల్గొన్నారు.

మహిళలు, పిల్లల సమస్యలను పరిష్కరించడంలో సీపీ మహేశ్​ భగవత్​ ముందంజలో ఉన్నందున సజ్జనార్​ ఆయన్ను అభినందించారు. 'మార్గదర్షక్​' కార్యక్రమం తమకెంతో ఉపయోగపడిందని శిక్షణ పొందిన వారు వివరించారు. శిక్షణ సమయంలో తమకు మద్దతు ఇచ్చిన రిసోర్స్ పర్సన్స్​ను మహేశ్​ భగవత్​ సత్కరించారు. త్వరలోనే 'సంఘమిత్ర' అనే మరో కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సీపీ వివరించారు.

Last Updated : Nov 8, 2020, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.