ETV Bharat / city

'ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు'

సర్కారు బడుల్లో ఖాళీలను భర్తీచేయాలంటూ నిరుద్యోగులు హైదరాబాద్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్​ వద్ద మహాధర్నా నిర్వహించారు. వీరికి మద్దతు తెలిపిన ఆర్​.కృష్ణయ్య... ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Aug 17, 2019, 5:58 PM IST

ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు: ఆర్​.కృష్ణయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్​ పోస్టులను భర్తీ చేయాలంటూ హైదరాబాద్​లో నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. లక్డీకపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య మద్దతు తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన నుంచి ఒక్కసారి కూడా టెట్​ పరీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్రాలో లక్ష ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు జరుగుతుంటే.. ఇక్కడ మాత్రం లక్ష గొర్రెలు, బర్రెలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే అన్ని స్థాయిలోని ఖాళీలను భర్తీ చేయకుంటే నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు: ఆర్​.కృష్ణయ్య

ఇవీ చూడండి: బియ్యం బస్తా మోసిన తహసీల్దార్​... ఎందుకంటే..?

TG_Hyd_57_27_Un Emps Jac Maha Dharana_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ... నిరుద్యోగులు హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహించారు. లకిడికపుల్ లోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరుద్యోగుల ఆందోళనకు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యాను నిర్వీర్యం చేసేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష ఉద్యోగాలు ఇస్తుంటే... ఇక్కడి ముఖ్యమంత్రి లక్ష గొర్రెలు , బర్రెలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు టెట్ పరీక్ష నిర్వహించలేదన్నారు . వెంటనే టెట్ పరీక్ష నిర్వహించి... ప్రభుత్వం పాఠశాలలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగులను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. బైట్ : ఆర్.కృష్ణయ్య ( జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ) బైట్ : కవిత ( నిరుద్యోగ యువతి )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.