ETV Bharat / city

'మీడియా సిబ్బంది భద్రతపై ప్రభుత్వం ఆందోళన'

హైదరాబాద్​లో మీడియా సిబ్బందికి పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ అరవింద్ కుమార్.. క్యూమార్ట్ సంస్థ సరఫరా చేసిన ఫేస్​ షీల్డ్స్​ పంపిణీ చేశారు.

que mart distributes face masks to media representatives
'మీడియా సిబ్బంది భద్రతపై ప్రభుత్వం ఆందోళన'
author img

By

Published : May 5, 2020, 4:25 PM IST

కరోనా వ్యతిరేక పోరాటంలో ముందున్న మీడియా సిబ్బంది.. భద్రత ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోందని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అరవింద్‌ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, డ్రైవర్లు, కంటైన్మెంట్ జోన్లలోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్యూమార్ట్‌ సంస్థ సరఫరా చేసిన ఫేస్‌ షీల్డ్స్‌ పంపిణీ చేశారు.

నగరంలోని పేదలకు, ట్రాఫిక్ పోలీసులకు ఫేస్‌ మాస్క్‌లు, ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నట్టు క్యూమార్ట్‌ సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ తెలిపారు. హైవేలపై కియోస్క్‌లు ఏర్పాటు చేసి.. వలస కూలీలకు జ్యూస్‌, బిస్కెట్ ప్యాకెట్లు అందించినట్టు తెలిపారు. కరోనా వైరస్‌ నుంచి తమను తాము రక్షించుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.