ETV Bharat / city

ఏఐఈఈఏ పరీక్షలో పీవీఎన్​ఆర్​వీయూ విద్యార్థుల ప్రతిభ

భారత వ్యవసాయ పరిశోధన మండలి - యూజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన పరీక్షల్లో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ ఎస్​టీ విరోజిరావు అభినందించారు.

pvnrvu students get top ranks in aieea exam
ఏఐఈఈఏ పరీక్షలో పీవీఎన్​ఆర్​ పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రతిభ
author img

By

Published : Nov 9, 2020, 9:40 PM IST

భారత వ్యవసాయ పరిశోధన మండలి - యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల్లో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటారు. ఏఐఈఈఏ పరీక్షలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. వివిధ విభాగాల్లో మొదటి పది ర్యాంకుల్లో మూడు ర్యాంకులు సాధించారు. వెటర్నరీ సైన్స్‌ విభాగంలో... బి.హనుమాన్‌ 3వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించాడు. ఎ.రాగిణిి 7వ ర్యాంకు సాధించింది. వెటర్నరీ బయోటెక్నాలజీ విభాగంలో మనోజ్ 7వ ర్యాంకు సాధించాడు. వెటర్నరీ సైన్స్ విభాగంలో బి.ఇందురెడ్డి 36వ ర్యాంకు, డి.నవీన్‌ 86వ ర్యాంకు, ఐ.కార్తీక్‌ 120వ ర్యాంకు, బి.కీర్తి 137వ ర్యాంకు, ఎస్.సాయి కిరణ్‌ 170 ర్యాంకులు సాధించారు.

యానిమల్ సైన్స్ విభాగంలో మోనికాసింగ్ 36వ ర్యాంకు, ఆశిశ్​ యాదవ్ 45వ ర్యాంకు, దిపాంశ్​0 50వ ర్యాంకు, ప్రదీప్‌కుమార్ 56వ ర్యాంకు, శ్రీహిత 89వ ర్యాంకు, శిశిధర్‌రెడ్డి 108వ ర్యాంకు, నమ్రిత్ 122వ ర్యాంకు, ప్రియాంకరెడ్డి 144వ ర్యాంకు, అఖిల్‌ 188వ ర్యాంకు, కైషిక్ 197వ ర్యాంకులు పొందారు. తెలంగాణ నుంచి 43 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు దక్కించుకున్నారు. ఇంతటి విజయాలు సాధించిన విద్యార్థులను పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ ఎస్‌టీ విరోజిరావు అభినందించారు.

ఇదీ చూడండి: 'చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న తపనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.