బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు లాల్‌దర్వాజ, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం తన తండ్రితో కలిసి ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు సింధుకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని తొలిసారి దర్శించుకున్నారు. ఇటీవలే విజయవాడ కనకదుర్గ, తిరుమల శ్రీవారిని సింధు దర్శించుకుంది. దర్శనానికి విచ్చేసిన సింధుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
కాగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో సింధు పాల్గొన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్లు పాల్గొన్న విషయం తెలిసిందే. సోమవారం దేశ రాజధాని దిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమాల అనంతరం భాగ్యనగరం చేరుకున్న సింధు ఇవాళ ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు.