ETV Bharat / city

టీనేజ్ కుర్రకారే.. ఆపదలో ఆదుకుంటారు.. సౌకర్యాలు కల్పిస్తారు - People For Urban and Rural Education

టీనేజ్ కుర్రకారు అంటే ఏం చేస్తుంటారు.. ఇంట్లో అల్లరి చేస్తారు.. బళ్లో, కాలేజీలో గోల చేస్తుంటారు.. కొంతమంది బాగా చదువుతారు కూడా..! అయితే ప్యూర్ యూత్.. పిల్లలు మాత్రం వీటన్నింటితో పాటు మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. బడులు బాగుండటానికి నిధులు సమీకరిస్తారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు... గ్రామీణ ప్రాంత పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తారు. కౌమార విషయాలపై అవగాహన కల్పిస్తారు..! ఇవన్నీ ఎక్కడ చేస్తారు.. వీళ్లు ఎక్కడుంటారనే కదా.. మీ డౌటు..! వీళ్లు అమెరికాలోనూ.. ఇండియాలోనూ.. ఉన్నారు. పనులు కూడా అన్నిచోట్లా చేస్తారు.

pure youth
టీనేజ్ కుర్రకారే.. ఆపదలో ఆదుకుంటారు.. సౌకర్యాలు కల్పిస్తారు
author img

By

Published : Jan 12, 2021, 10:46 PM IST

టీనేజ్ కుర్రకారే.. ఆపదలో ఆదుకుంటారు.. సౌకర్యాలు కల్పిస్తారు

ప్యూర్ యూత్... అనేది ప్యూర్ అనే స్వచ్చంద సంస్థకు అనుబంధంగా పని చేస్తుంది. పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థకు సంక్షిప్త రూపమే ప్యూర్. శైలా తాళ్లూరి అనే ఎన్​ఆర్ఐ తన స్నేహితులతో కలిసి ఈ సంస్థను అమెరికాలో ఏర్పాటు చేశారు. అమెరికా, ఆఫ్రికాతో పాటు..భారత్​లోని పలు రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు విద్యాసంస్థలకు సౌకర్యాలు కల్పిస్తుంది. దానికి అనుబంధంగానే ప్యూర్ యూత్ 2017లో ఏర్పాటైంది. ఇందులో అందరూ టీనేజీ పిల్లలే సభ్యులు. పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు.. తమ చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత మేలు చేసేలా ప్రోత్సహించడమే ఈ వింగ్ ముఖ్య ఉద్దేశ్యం. ప్యూర్ యూత్ పిల్లలు తాము చదువుకుంటూనే అవసరమైన సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు.. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.

మన తెలుగు పిల్లలే ఎక్కువ....

ప్యూర్ యూత్ అమెరికా కేంద్రంగా ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ మంది మన తెలుగు పిల్లలే..! తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి యూఎస్​ లో స్థిరపడిన వారి పిల్లలే ఇందులో సభ్యులుగా ఉన్నారు. యూఎస్​లోనే ప్యూర్​కు 30 చాప్టర్లు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ స్టూడెంట్ చాప్టర్లు ఉన్నాయి. ఇవి కాకుండా భారత్​లోని వైజాగ్​లో కూడా ప్యూర్ యూత్ చాప్టర్ పనిచేస్తోంది. చాప్టర్లలోని సభ్యులను యూత్ అంబాసిడర్లుగా పిలుస్తారు. ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం.. వారిని నేరుగా కానీ.. ఆన్​లైన్ ద్వారా కానీ కలవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం సాంకేతిక అంశాలను ఒకరినొకరు పంచుకోవడం చేస్తుంటారు. ప్యూర్ యాత్ చాప్టర్లకు.. హేమ కంఠంనేని చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్​గా నాయకత్వం వహిస్తున్నారు.

వరంగల్​, హైదరాబాద్​లోనూ..

ప్యూర్ యూత్ సభ్యులంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించి... నిధులు సమీకరిస్తుంటారు. వాటితోనే భారత్​తో సహా అనేక ప్రాంతాల్లో పాఠశాలలకు సౌకర్యాలు కల్పిస్తుంటారు. తమ మాతృసంస్థ ప్యూర్ ద్వారా ఈ పనులు జరుగుతాయి. వరంగల్ జిల్లా మొగిలిచర్లలోని ప్రభుత్వ పాఠశాలకు డైనింగ్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ సమకూర్చడంతో పాటు.. పుస్తకాలు అందజేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని కొన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్లు, బెంచ్​లు సమకూర్చారు. హైదరాబాద్​లోని గౌరెల్లి, జనగాం పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్​లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలోని పాఠశాలలకు 46వేల నోట్ బుక్స్ అందజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థినుల కోసం సైకిళ్లు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు జరిగాయి. మెదక్ జిల్లాలోని అహ్మద్​నగర్, ధర్మసాగర్ జిల్లా పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నారు.

గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత...

ఎక్కువ అవసరం ఎవరికి ఉందో ఆ ప్రాంతాలనే సాయం కోసం ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా సౌకర్యాలు తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదిలో బెంచీలు వంటి సౌకర్యాలు కల్పించాక.. కంప్యూటర్లు, పుస్తకాలు, డిజిటల్ తరగతులు వంటివి ఏర్పాటు చేస్తారు. కౌమార దశలో గ్రామాల్లోని ఆడపిల్లలు పడే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వారికి శానిటరీ నాప్​కిన్లు పంపిణీ చేస్తుంటారు. సరైన సౌకర్యాలు లేని బాగా పేదపిల్లలకు లో దుస్తులు అందిస్తున్నారు. స్థానికంగా ఉండే ప్యూర్ వాలంటీర్ల ద్వారా సమాచారం తీసుకుని.. విద్యార్థులు నిధులు సమకూరుస్తుంటారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, తాము తయారు చేసిన వంటలను విక్రయించడం వంటివి చేస్తుంటారు. వీళ్లలో ఎక్కువమంది ఎన్​ఆర్​ఐలే కావడంతో తమ స్వస్థలాలకు వచ్చినప్పుడు.. నేరుగానే ఈ పనుల్లో పాల్గొంటారు. పిల్లలకు వర్క్​షాప్​లు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. మిగిలిన సమయాల్లో ప్యూర్ మాతృసంస్థ ద్వారా ఈ పనులు జరుగుతాయి.

కేవలం పాఠశాలలకు పనులు చేయడం మాత్రమే కాదు. ప్రపంచాన్ని కలవరపెట్టిన కొవిడ్ సమయంలోనూ ఈ యూత్ అంబాసిడర్లు సేవలు అందించారు. ముఖ్యంగా ఇళ్లలోనే క్లాత్ మాస్కులు తయారు చేసి పంచారు. వివిధ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ఆహారాన్ని అందించారు. లాక్​డౌన్ సమయంలో భారత్​లో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు.. ఆహారాన్ని , బట్టలను అందించారు. మొన్నటి హైదరాబాద్ వరదల్లోనూ. ప్యూర్ సంస్థ బాధితులకు సాయం అందించింది.

కష్టాల్లో ఉన్న వారికి తోడ్పడటం.. మరికొంత మందికి ప్రేరణ కల్పించడం.. ఇదీ.. ప్యూర్ యూత్ నినాదం. అందులో భాగంగానే తమ చాప్టర్లను విస్తరించుకుంటూ వెళుతున్నారు. చేసే సాయాన్ని పెంచుతున్నారు.

ఇవీచూడండి: జీహెచ్​ఎంసీలో మొదలైన ఉచిత తాగునీటి సరఫరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.