ETV Bharat / city

pulichinthala: పూర్తయిన స్టాప్‌లాక్ గేట్ పనులు.. జలాశయాన్ని నింపనున్న అధికారులు

author img

By

Published : Aug 8, 2021, 5:24 AM IST

Updated : Aug 8, 2021, 6:34 AM IST

పులిచింతల ప్రాజెక్టులో గేటు ఊడిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్టాప్‌లాక్‌ గేటు పూర్తయ్యాయి. 11 ఎలిమెంట్లు ఏర్పాటు చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని గేట్లు మూసి ఎగువ ప్రవాహంతో జలాశయాన్ని నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

pulichintala project
పులిచింతల ప్రాజెక్టులో స్టాప్‌లాక్‌ గేటు పనులు

పులిచింతల జలాశయంలో నీటి ప్రవాహాన్ని నిలువరించే స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఆటంకాలను అధిగమిస్తూ క్రమంగా యంత్రాంగం ముందుకెళ్లింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు 11 ఎలిమెంట్లు బిగించారు. శనివారం రాత్రికి తొమ్మిదింటిని అమర్చారు. 27-30 టన్నుల బరువుండే ఇనుప దిమ్మెలను ఇన్నాళ్లూ వాడకపోవడంతో అమర్చేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పులిచింతల 16వ గేట్ వద్ద పూర్తయిన స్టాప్‌లాక్ గేట్ పనులు అర్ధరాత్రి 11 ఎలిమెంట్స్ అమర్చి నీరు లీకేజీని అడ్డుకున్నారు నిపుణులు. ఇవాళ అన్ని గేట్లు మూసి ఎగువ ప్రవాహంతో జలాశయాన్ని నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కనిపించిన గేటు

ప్రవాహ ధాటికి ఊడి విరిగి పడిపోయిన 16వ నంబరు గేటు డ్యాం నుంచి 500 మీటర్ల దూరంలో కనిపించింది. 250 టన్నుల బరువుండే ఆ గేటు ఆచూకీ కోసం మత్స్యకారులను రంగంలోకి దింపారు. ఓ మత్స్యకారుడికి కనిపించగానే ఇంజినీరింగ్‌ అధికారులను తీసుకెళ్లి చూపగా వారు నిర్ధారించారు. గేటును ఇనుపతాళ్లతో లాగుతూ డ్యాం వద్దకు చేర్చాలని ఇంజినీరింగ్‌ అధికారి ఒకరు చెప్పారు. గేటును తిరిగి వినియోగంలోకి తేవటానికి అవసరమయ్యే ట్రునియన్‌ను జపాన్‌ నుంచి తెప్పిస్తామని చెబుతున్నారు.

అడుగంటిన నిల్వలు

మూడు రోజులుగా 38 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు వదిలేయడంతో జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం 4-5 టీఎంసీలకు మించి నిల్వలు లేవు. అయితే, వర్షాకాలం కావటంతో ఎగువ నుంచి వరదలు వస్తాయని, వాటితో తిరిగి జలాశయాన్ని నింపుతామని అధికారులు చెబుతున్నారు.

పులిచింతల 23 గేట్ల మూసివేత..

పులిచింతల ప్రాజెక్టులో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు 6.10 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇంజినీర్లు తెలిపారు. ఇప్పటికి తొమ్మిది ఇనుప దిమ్మెలను అమర్చామని, మరో రెండు అమర్చాల్సి ఉందని చెప్పారు. ఎగువ నాగార్జునసాగర్‌ పరీవాహక ప్రాంతం నుంచి 31,589 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని తెలిపారు. దిగువకు నీటి విడుదల నిలిపివేశామని చెప్పారు. గేట్ల లీకేజీ ద్వారా 600 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోందన్నారు. మిగిలిన 23 గేట్లు మూసివేశామని తెలిపారు. ఏఈలు రాజు, రాజశేఖర్‌, గోపాల్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

సీడబ్ల్యూసీ ప్రోటోకాల్‌ పాటించలేకపోయాం

‘పులిచింతలకు మూడేళ్ల నుంచి వరదలు బాగా వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టు కావటంతో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని దిగువకు వదలడానికి కేంద్ర జలవనరుల మండలి (సీడబ్ల్యూసీ) నిబంధనల మేరకు కొన్ని ప్రోటోకాల్స్‌ పాటించాలి. వాటిని పాటించలేకపోయాం. మిగులు జలాలను దిగువకు వదిలేటప్పుడు గేట్లు ఊగుతున్నాయా? వైబ్రేషన్స్‌ వస్తున్నాయా, లీకేజీలు ఏమైనా ఏర్పడ్డాయా అనేది తెలుసుకోవచ్చు. ఆ ప్రోటోకాల్స్‌ పాటించకపోవడంతో అవేవీ తెలుసుకోలేకపోయాం. గేటు విరిగిపడిన విషయంలో నిర్లక్ష్యం ఎవరిదైనా వదలబోము. తాత్కాలిక గేటు పనులు పూర్తయిన మరుక్షణం నుంచే ఒక్క నీటి బొట్టు కూడా వృథా కాకుండా జలాశయంలోకి మళ్లిస్తాము’ - నారాయణరెడ్డి. ఈఎన్‌సీ.

ఇదీ చదవండి:

Pulichintala Gate: ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు

Last Updated : Aug 8, 2021, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.