ETV Bharat / city

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్​ సాధించిన ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర - super school latest news

Wonder Book of Records: ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్రను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్​ వరించింది. 24 రోజుల్లో 15వేల మంది విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసినందుకు ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు ఈ అవార్డును అందించారు.

Wonder Book of Record
Wonder Book of Record
author img

By

Published : Apr 7, 2022, 10:51 PM IST

Wonder Book of Records: ఇరవై నాలుగు రోజుల్లో 153 పాఠశాలలను సందర్శించి 15వేల 480 మంది విద్యార్థులకి శిక్షణ పూర్తి చేసినందుకు ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర వండర్ బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటుసంపాదించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు ఆయన పేరును నమోదు చేస్తూ మెడల్, మెమెంటో, సర్టిఫికెట్ బ్యార్జ్, పెన్, బుక్ ఆఫ్ రికార్డ్ స్టిక్కర్స్ పంపించారు. ఆ అవార్డును ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్​గౌడ్, తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ దేవెందర్ బండారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.

'గత రెండు సంవత్సరాల నుంచి కరోనా విద్యా వ్యవస్థ మీద, విద్యార్థి ఆలోచన విధానం పైన చాలా ప్రభావం చూపింది. పాఠశాలలకి, ఉపాధ్యాయులకు దూరమై అనేక మంది విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోయారు. ఇటువంటి సమయంలో విద్యార్థుల్ని సరైన మార్గంలో తీసుకువచ్చేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడ్డాయి.'

-సుధీర్ సండ్ర, ప్రముఖ సైకాలజిస్ట్

ఈ కార్యక్రమంలో సూపర్ స్కూల్ డైరెక్టర్ మృదుల దొరస్వామి, డిజిటల్ కనెక్ట్ సీఈవో నిఖిల్ గుండా, క్రియేటివ్ హెడ్ స్వాతికిరణ్, మహేష్ కుమార్, మానస, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గవర్నర్​ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్​.. ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.